IMPORTANT: RRB EXAM PORTAL is NOT associated with Railway Recruitment Board(RRB) or Indian Railways.

(Download) RRB JE Paper (TELUGU) 24-may-2019 Shift-1

(Download) RRB JE Paper (TELUGU) 24-may-2019 Shift-1

1. ఒక పనిని P మొదలుపెట్టి, P మరియు Q రోజు మార్చి రోజు పనిచేస్తే, ఆ పని 17 రోజుల్లో పూర్తి అవుతుంది. అదే పనిని Q మొదలుపెట్టి Q మరియు P రోజు మార్చి రోజు పనిచేస్తే ఆ పని 53/3 రోజుల్లో పూర్తవుతుంది. ఆ పనిని వాళ్లు విడివిడిగా చేస్తే, దాన్ని పూర్తి చేయడానికి ఒక్కొక్కరికీ ఎన్నిరోజులు పడుతుంది?

A) P = 35 రోజులు; Q = 35/3 రోజులు
B) P = 12 రోజులు; Q = 35 రోజులు
C) P = 35 రోజులు; Q = 35 రోజులు
D) P = 35/3 రోజులు; Q = 35 రోజులు

2. ఒకవేళ a యొక్క 20% = b అయితే, అప్పుడు 20 యొక్క b% దేనికి సమానం?

A) a యొక్క 30%
B) a యొక్క 20%
C) a యొక్క 5%
D) a యొక్క 4%

3. ఈ క్రింది వాటిలో "చేయి లేదా చావు" నినాదం ఏ ఉద్యమానికి సంబంధించినది?

A) క్విట్ ఇండియా ఉద్యమం
B) స్వదేశీ ఉద్యమం
C) పౌర నిరాకరణ ఉద్యమం
D) సహాయ-నిరాకరణ ఉద్యమం

4. ఒక నిర్దిష్ట కోడ్ లో, 'SUMMIT' ను 'KSQRGK' గా వ్రాస్తే, అప్పుడు అదే కోడ్ లో 'UMPIRE'ను ఎలా వ్రాస్తారు?

A) NKSCPG
B) NKSCGP
C) NKSPCG
D) NKCSPG

5. మానవునిలోని ఏ అవయవంలో 'లాంగర్‌హాన్స్ పుటికలు' ఉంటాయి?

A) క్లోమము
B) మెదడు
C) కాలేయం
D) పిత్తాశయం

6. ధ్వని తరంగాలని విద్యుత్ సంకేతాలుగా మార్చే పరికరం ఏది?

A) 'మైక్రోఫోన్'
B) 'ఆంఫ్లిఫైయర్'
C) 'లౌడ్ స్పీకర్'
D) 'హెడ్‌ఫోన్'

7. క్రింద ఇచ్చిన సంబంధాన్ని ఏ పదం అత్యుత్తమ రీతిలో పూర్తి చేస్తుంది?
జపాన్ : గ్రీన్ ఫీసంట్ :: భారతదేశం : ?

A) ఈము
B) చిలుక
C) పిచ్చుక
D) నెమలి

8. క్రింది శ్రేణిలోని లోపించిన అక్షరాల గ్రూపును కనుగొనండి.
ZC, AI, (…), KI, PL

A) SV
B) FV
C) MO
D) EZ

9. క్రింద ఇచ్చిన సంబంధాన్ని ఏ పదం ఉత్తమంగా పూర్తి చేస్తుంది?
హైగ్రోమీటర్ : ఆర్ద్రత :: బారోమీటర్ : ?

A) ఉష్ణోగ్రత
B) పీడనం
C) ప్రవాహం
D) వేగం

10. 1.08, 0.36 మరియు 0.9 యొక్క గ.సా.భా (GCD) కనుగొనండి.

A) 1.8
B) 0.03
C) 0.18
D) 18

11. సుత్తి ద్వారా మనం కండర శక్తిని ప్రయోగించినప్పుడు, గోడలోకి మేకు దిగేలా చేసే మరో శక్తి ఏది?

A) ఘర్షణ
B) విద్యుదాకర్షణ బలం
C) స్ప్రింగ్ బలం
D) అయస్కాంత బలం

12. A, B మరియు C వయస్సులు 2 : 4 : 5 నిష్పత్తిలో ఉన్నాయి వారి వయస్సుల మొత్తం 77. పదేళ్ల తర్వాత A వయసు B వయసుకి ఎంత నిష్పత్తిలో ఉంటుంది.

A) 12 : 19
B) 10 : 17
C) 13 : 18
D) 11 : 14

13. మొదటి కామన్ వెల్త్ క్రీడలు ఎప్పుడు జరిగాయి?

A) 1930
B) 1954
C) 1942
D) 1918

14. విద్యుత్‌ సామర్థ్యానికి SI ప్రమాణమేమిటి?

A) జౌల్ (J)
B) వాట్ (W)
C) వోల్ట్ (V)
D) ఆంపియర్ (A)

15. ఈ ప్రశ్నలో, మూడు వ్యాఖ్యానాలు వాటిని అనురించి రెండు తీర్మానాలు ఇవ్వబడినాయి. తార్కికంగా ఏ తీర్మానం(నాలు) ఉత్తమంగా సరిపోతుందో(తాయో) ఎంపిక చేసుకోండి.

వ్యాఖ్యానాలు:
1) కొన్ని సాకర్‌లు షూలు.
2) కొన్ని షూలు కవర్‌లు.
3) అన్ని కవర్‌లు ప్లాస్టిక్‌లు.

తీర్మానాలు:
I. కొన్ని ప్లాస్టిక్‌లు షూలు.
II. కొన్ని సాకర్‌లు ప్లాస్టిక్‌లు.

A) తీర్మానం I మాత్రమే అనుసరిస్తుంది
B) తీర్మానం I మరియు II రేండూ అనుసరిస్తున్నాయి
C) తీర్మానం II మాత్రమే అనుసరిస్తుంది
D) తీర్మానం I లేదా II ఏదీ అనుసరించడం లేదు

16. 2019 ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ వేసవి క్రీడలు ఎప్పుడు ప్రారంభమైనవి?

A) 20 మార్చి 2019
B) 1 జనవరి 2019
C) 3 ఫిబ్రవరి 2019
D) 14 మార్చి 2019

17. జాన్ గంటకు 10 కి.మీ వేగంతో సైకిల్ తొక్కుతూ మధ్యాహ్నం 2 గంటలకి తన గమ్యం చేరాడు. అతను గంటకు 15 కి.మీ వేగంతో ప్రయాణించి ఉంటే, సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి గమ్యం చేరేవాడు. అదే గమ్యాన్ని మధ్యాహ్నం 1 గంటకు చేరాలంటే, అతను ఏ వేగంతో ప్రయాణం చేయాలి?

A) గంటకు 12 కి.మీ
B) గంటకు 11 కి.మీ
C) గంటకు 14 కి.మీ
D) గంటకు 8 కి.మీ

A) n = 20, r = 10%
B) n = 14, r = 7%
C) n = 12, r = 6%
D) n = 15, r = 15/2%

19. సరళీకరణ:- (√225/729 - √25/144) ÷ √16/81

A) 7/16
B) 5/16
C) 3/16 
D) 1/16

20. 8 పెన్నులు రూ. 40 కి కొనుగోలు చేసి, 6 పెన్నులు రూ. 40కి విక్రయించారు. లాభం లేదా నష్టం శాతాన్ని కనుగొనండి.

A) లాభం 33.33%
B) లాభం 20%
C) నష్టం 30%
D) లాభం 40%

21. రవి తన ఇంటి నుంచి తూర్పు వైపు 2 కి.మీ నడిచాడు. అక్కడ ఎడమవైపు తిరిగిన తర్వాత, 0.5 కి.మీ ప్రయాణించి అతను పార్కుకి చేరాడు. అతని ఇంటి నుంచి పార్క్ ఏ దిక్కులో ఉంది?

A) ఈశాన్యం
B) నైరుతి
C) వాయవ్యం
D) ఆగ్నేయం

22. క్షయ అనే వ్యాధి ______కి వస్తుంది.

A) కాలేయం
B) క్లోమం
C) ఊపిరితిత్తులు
D) గుండె

23. క్రింది వాటిలో అలోహం ఏది?

A) నైట్రోజన్
B) అల్యూమినియం
C) ఇనుము
D) జింక్

24. పిత్తాశయంలో ఏ పదార్థం నిల్వచేయబడుతుంది మరియు సాంద్రీకరించబడుతుంది?

A) రక్తం
B) శోషరసం
C) పైత్యరసం
D) నీరు

25. సంకోచం సృష్టించడానికి కుదించిన కండరాల భాగం -

A) 'మైసిన్'
B) 'ఎఫిమైసియమ్'
C) 'ఫాసికులి'
D) 'యాక్టిన్'

26. ______ సంఖ్య అనేది పరమాణు ద్రవ్యరాశి సంఖ్య మరియు పరమాణు సంఖ్య మధ్య భేదానికి సమానంగా ఉంటుంది.

A) ప్రోటాన్లు
B) న్యూట్రాన్లు
C) ఎలక్ట్రానులు
D) ప్రోటాన్లు మరియు ఎలక్ట్రానులు రెండూ

28. ఈ ప్రశ్నలో, ఒక వ్యాఖ్యానం ఇవ్వబడింది. దానిని అనుసరిస్తూ నాలుగు తీర్మానాలు కూడా ఇవ్వబడ్డాయి. ఇచ్చిన వ్యాఖ్యానానికి తార్కికంగా సరిపోయే తీర్మానం(లు) ఎంచుకోండి.

వ్యాఖ్యానం:
I. పరీక్ష పాస్ కావాలంటే, కష్టపడి చదవాలి.

తీర్మానాలు:
I. పరీక్ష అనేది కఠిన శ్రమతో మాత్రమే ముడిపడినది.
II. కఠిన శ్రమ చేయని అందరూ పాస్ అవుతారు.
III. కఠిన శ్రమ లేకపోతే ఎవరూ పాస్ కాలేరు.
IV. కఠిన శ్రమ చేసే వ్యక్తి సంతృప్తికర వ్యక్తిగా ఉంటాడు.

A) తీర్మానం IV మాత్రమే అనుసరిస్తోంది
B) తీర్మానం I మాత్రమే అనుసరిస్తోంది.
C) తీర్మానం I మరియు II మాత్రమే అనుసరిస్తున్నాయి
D) తీర్మానం III మాత్రమే అనుసరిస్తోంది

29. రాజ్యాంగ యంత్రాంగాలు విచ్ఛిన్నం అయినట్లయితే, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఒక రాష్ట్ర పరిపాలనను చేపట్టవచ్చు?

A) అధికరణం 343
B) అధికరణం 352
C) అధికరణం 356
D) అధికరణం 83

30. ఒక సంఖ్య యొక్క ఘనం విలువ (153)2 నుండి తీసివేస్తే, 1457 అనే సంఖ్య వస్తుంది. ఆ సంఖ్యను కనుగొనండి.

A) 16
B) 24
C) 28
D) 18

31. క్రింద ఇచ్చిన సంబంధాన్ని ఏ పదం అత్యుత్తమ రీతిలో పూర్తి చేస్తుంది?
మోహినీయాట్టం : కేరళ :: సత్రియ : ?

A) అస్సాం
B) మణిపూర్
C) ఆంధ్ర ప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్

32. ఒక దీర్ఘచతురస్రం పొడవు : వెడల్పు = 4 : 3గా ఉంటే, పొడవు : కర్ణం విలువ ఎంత?

A) 2 : 3
B) 4 : 5
C) 4 : 7
D) 1 : 5

33. శ్రేణిని పూర్తి చేయండి.
13, 14, 32, 123, (…)

A) 682
B) 635
C) 748
D) 712

34. క్రింది శ్రేణిలో తప్పైన సంఖ్యను కనుగొనుము.
2, 6, 18, 54, 161, 486

A) 161
B) 2
C) 486
D) 18

35. క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి మరియు దాని క్రింద ఇచ్చిన ప్రశ్నకి సమాధానమివ్వండి.

ఆరేసి సీట్లతో ఉన్న రెండు సమాంతర వరుసల్లో పదిమంది స్నేహితులు కూర్చుని ఉన్నారు. ప్రతి వరుసలోనూ ఒక సీటు ఖాళీగా ఉంది. V, W, X, Y మరియు Z అనే వారు వరుస-1లో దక్షిణానికి ఎదురుగా ఉండేలా కూర్చుని ఉన్నారు. I, J, K, L మరియు M అనే వారు వరుస-2లో ఉత్తరానికి ఎదురుగా ఉండేలా కూర్చుని ఉన్నారు. వీరిలో ప్రతిఒక్కరికీ అడిడాస్, నైక్, పుమా, బాటా, లీ కూపర్, నివియా, ప్రొవోగ్యూ, లొట్టో, వుడ్‌ల్యాండ్ మరియు స్పార్క్స్ అంటూ ఒకొక్క బ్రాండ్ షూష్ నచ్చుతుంది.
L అనే వ్యక్తి Kకి కుడివైపు మూడో స్థానంలో కూర్చుని ఉన్నాడు, అతనికి బాటా నచ్చుతుంది. J మరియు ఖాళీ సీటుకి మధ్యలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుని ఉన్నారు. J అనే వ్యక్తికి లీ కూపర్ లేదా పూమా నచ్చదు. Z అనే వ్యక్తి X పక్కన కూర్చోలేదు. Wకి స్పార్క్స్ నచ్చుతుంది. పూమా నచ్చే వ్యక్తి లొట్టో నచ్చే వ్యక్తికి ఎదురుగా ఉన్నాడు. పూమా నచ్చే వ్యక్తి Lకి ఎదురుగా కూర్చున్న వ్యక్తికి కుడివైపు మూడవ స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఎదురుగా కూర్చుని ఉన్నాడు. X అనే వ్యక్తి Yకి పక్కన కూర్చోలేదు. లీ కూపర్ గానీ లేదా నివియా గానీ ఇష్టపడని M అనే వ్యక్తి ఖాళీ సీటుకి ఎదురుగా కూర్చోలేదు. L గానీ, K గానీ వరుసల చిట్టచివర్లలో కూర్చోలేదు. Y అనే వ్యక్తి Kకి ఎదురుగా ఉన్నాడు. ఖాళీ సీట్లు రెండూ ఎదురెదురుగా లేవు. X మరియు W మధ్య రెండు సీట్లు ఉన్నాయి, W అనే వ్యక్తి స్పార్క్స్ ఇష్టపడే వ్యక్తికి కుడివైపు మూడవ స్థానంలో కూర్చుని ఉన్నాడు. వుడ్‌ల్యాండ్ ఇష్టపడే వ్యక్తి బాటాని ఇష్టపడే వ్యక్తికి ఎదురుగా ఉన్నాడు. అడిడాస్ ఇష్టపడే వ్యక్తి మరియు లొట్టో ఇష్టపడే వ్యక్తి ఒకరికొకరు పక్కపక్కనే ఉన్నారు. వరుస-1లోని ఖాళీ సీటు Yకి పక్కన లేదు. J అనే వ్యక్తి వరుసల చిట్టచివర్లలో ఒకదానిలో కూర్చుని ఉన్నాడు. Kకి అడిడాస్ మరియు లొట్టో నచ్చదు. వరుస-1లోని ఖాళీ సీటు Lకి ఎదురుగాలేదు. L అనే వ్యక్తి వరుసలోని ఏ చిట్టచివరలోనూ కూర్చోలేదు.

క్రింది వారిలో వరుస-2లోని ఖాళీ సీటుకి ఎదురుగా ఉన్నవారెవరు?

A) W
B) Z
C) Y
D) V

36. ఒక దీర్ఘచతురస్రాకార అర నేలపై కర్ణం పొడవు 7.5 అడుగులు. అర పొట్టి భుజం 4.5 అడుగులు. అయితే అర వైశాల్యాన్ని చదరపు అడుగుల్లో కనుగొనండి.

A) 27 చదరపు అడుగులు
B) 37 చదరపు అడుగులు
C) 5.5 చదరపు అడుగులు
D) 13.5 చదరపు అడుగులు

37. ఈ ప్రశ్నలో, రెండు వ్యాఖ్యానాలు వాటిని అనురించి ఒక తీర్మానం ఇవ్వబడినాయి. క్రింది ఏ ప్రత్యామ్నాయం ఇచ్చిన తీర్మానాన్ని సమర్దిస్తున్నదో కనుగొనుము.

వ్యాఖ్యానాలు:
1) ఆక్సిజన్ ఒక వాయువు
2) సిలీండరు వాయువును కలిగి ఉంటుంది

తీర్మానం:
సిలీండరు అక్సీజన్ ను కలిగి ఉంటుంది

A) నిర్ణయించబడిన తీర్మానం బహుశ ఒప్పు .
B) నిర్ణయించబడిన తీర్మానం తప్పు.
C) నిర్ణయించబడిన తీర్మానం సంబంధం లేనిది.
D) నిర్ణయించబడిన తీర్మానం ఖచ్చితంగా ఒప్పు

38. ఈ ప్రశ్నలో, రెండు వ్యాఖ్యానాలు వాటిని అనురించి రెండు తీర్మానాలు ఇవ్వబడినాయి. తార్కికంగా ఏ తీర్మానం(నాలు) ఉత్తమంగా సరిపోతుందో(తాయో) ఎంపిక చేసుకోండి.

వ్యాఖ్యానాలు:
1) కొన్ని టోపీలు కుల్లాలు
2) కొన్ని కుల్లాలు చాపలు

తీర్మానాలు:
I. కొన్ని కుల్లాలు టోపీలు
II. కొన్ని చాపలు కుల్లాలు

A) తీర్మానం I మాత్రమే అనుసరిస్తుంది
B) తీర్మానం I మరియు II రెండూ అనుసరిస్తున్నాయి
C) తీర్మానం I లేదా II అనుసరిస్తాయి
D) తీర్మానం II మాత్రమే అనుసరిస్తుంది

39. సరిపడినంతగా ఏర్పాటు చేసిన ఆహారం 250 మంది సైనికులకి 30 రోజులు వస్తుంది. 50 మంది సైనికులు ఆ శిబిరానికి హాజరు కాకపోతే, ఆ ఆహారం ఇంకా ఎన్ని ఎక్కువ రోజులకి వస్తుంది?

A) 9 రోజులు
B) 12 రోజులు
C) 7.5 రోజులు
D) 10 రోజులు

40. క్రింది ప్రశ్నలో, రెండు సంకేతాలను పరస్పరం మార్చడం ద్వారా సమీకరణాన్ని సరిచేయండి.
5 + 3 x 12 ÷ 12 - 4 = 12

A) + మరియు x
B) - మరియు x
C) + మరియు -
D) - మరియు ÷

41. ఒక అర్ధగోళపు మధ్యచ్ఛేద వైశాల్యం 2772 సెం.మీ2 మరియు దాని ఘనపరిమాణం 19404 సెం.మీ3. దాని వ్యాసార్థం ఎంత?

A) 42 సెం.మీ
B) 13 సెం.మీ
C) 22.5 సెం.మీ
D) 21 సెం.మీ

42. రమ్య తన ఇంట్లోని గోడ గడియారం చూసినప్పుడు అది 3:50 అని సూచిస్తుండగా, గంటల ముల్లు తూర్పు వైపు సూచిస్తోంది. నిమిషాల ముల్లు ఏ దిక్కును సూచిస్తూ ఉంటుంది?

A) ఆగ్నేయం
B) ఈశాన్యం
C) వాయువ్యం
D) నైరుతి

43. ఏదైనా జీవి దాని జీవితచక్రంలో అనేక ఆతిధేయిల మీద ఆధారపడితే దాన్ని ఇలా పిలుస్తారు -

A) మాంసాహార భక్షకులు (Predator)
B) 'పారాసైటాయిడ్'
C) పరాన్నజీవి
D) పూతికాహారులు

44. ఒక వ్యక్తి కారులో నిర్థిష్ట దూరం ప్రయాణించడం ద్వారా తన మొత్తం ప్రయాణంలో సగం పూర్తి చేశాడు. మిగిలిన దూరంలో, ఆరింట ఐదు వంతులు ఒక వ్యానులో ప్రయాణించాడు మరియు మిగిలిన దూరాన్ని ఆటోలో వెళ్లాడు. ఆటోలో ప్రయాణించిన దూరం 5 కి.మీ అయితే, మొత్తంగా అతను ప్రయాణించిన దూరం ఎంత?

A) 48 కి.మీ
B) 72 కి.మీ
C) 45 కి.మీ
D) 60 కి.మీ

45. క్రింది శ్రేణిలోని తప్పైన అక్షరాల గ్రూపును కనుగొనండి.
AZ, EV, IR, NO, QJ

A) IR
B) QJ
C) NO
D) EV

46. భారతదేశం యొక్క అత్యంత తూర్పు చివరన ఉన్న రాష్ట్రం ఏది?

A) మిజోరం
B) మణిపూర్
C) అరుణాచల్ ప్రదేశ్
D) అస్సాం

47. 10, 18, 36, 54 అనే పరమాణు సంఖ్యలు కలిగిన మూలకాలు:

A) జడ వాయువులు
B) 'రేర్ ఎర్త్‌లు'
C) తేలికైన లోహాలు
D) 'హలోజెన్లు'

48. ప్రొటీన్లు అనేవి దీనిలో సమగ్ర భాగంగా ఉంటాయి -

A) ఎంజైములు
B) ప్రతిదేహాలు
C) కణ త్వచము
D) ఐచ్చికలు అన్నీ

49. బరువుకి SI ప్రమాణమేమిటి?

A) న్యూటన్
B) కిలోగ్రామ్
C) సెకండ్
D) మీటర్

50. ఈ క్రింది వాటిలో ఫెడ్ కప్ దేనితో అనుబంధం కలిగి ఉంది?

A) మహిళల టెన్నిస్
B) మహిళల క్రికెట్
C) పురుషుల క్రికెట్
D) హాకీ

51. 2018 డిసెంబ్ 30న మరణించిన మృణాల్ సేన్ ఏ రంగంలో ప్రఖ్యాతి చెందినవారు?

A) క్రీడలు
B) పత్రికా రంగం (Journalism)
C) సినీ పరిశ్రమ
D) రాజకీయాలు

52.  విశ్లేషించడానికి:- (3.6 x 0.48 x 2.50) / (0.12 x 0.09 x 0.5)

A) 800
B) 8
C) 80
D) 8000

53. శ్రేణిని పూర్తి చేయండి.
2, 6, 12, 20, 30, 42, 56, (…)

A) 72
B) 60
C) 70
D) 64

A) 2/√3
B) √3/2
C) 3/2
D) 1/√2

55. ఈ క్రింది ఏ క్రీడతో 'బందోడ్కర్ గోల్డ్ ట్రోఫీ' అనుబంధం కలిగి ఉంది?

A) బాడ్మింటన్
B) క్రికెట్
C) కాలిబంతి ఆట (Football)
D) బాస్కెట్‌బాల్

56. సరళీకరించండి: sin 780° sin 480° + cos 120° sin 30°

A) 1/2
B) 1/3
C) 0
D) 2/3

57. క్రింది ఏ జత సంఖ్యలు ఒక సాపేక్ష ప్రధాన సంఖ్య (coprime)?

A) 4, 12
B) 15, 9
C) 33, 35
D) 45, 9

58. ఒక 200 మీటర్ల పందెంలో, B పైన A 35 మీటర్లు లేదా 7 సెకండ్ల తేడాతో గెలుపొందాడు. ఈ పరుగులు A తీసుకున్న సమయం ఏమిటి?

A) 47 సెకనులు
B) 40 సెకనులు
C) 33 సెకనులు
D) 36 సెకనులు

59. ఇచ్చిన ఐచ్చికాల నుండి భిన్నమైనదానిని కనుగొనుము.

A) E
B) J
C) D
D) F

60. "భూ తాప సామర్ధ్యం" (Global Warming Potential) (GWP)ను లెక్కించడం కొరకు దిగువ పేర్కొన్న ఏ వాయువులను ఉపయోగిస్తారు?

A) మీథేన్
B) కార్బన్ డయాక్సైడ్
C) ఓజోన్
D) నైట్రోజన్ డయాక్సైడ్

61. రెండు సంఖ్యల్లో ఒక దాని వర్గం వేరొక దాని వర్గానికి 8 రెట్ల కంటే 224 తక్కువగా ఉంది. సంఖ్యలు 3 : 4 నిష్పత్తిలో ఉంటే, సంఖ్యల్ని కనుగొనండి.

A) 8, 18
B) 6, 8
C) 12, 16
D) 9, 12

62. భారతదేశంలోని ఏ నగరాన్ని 'పింక్ సిటీ' అని కూడా పిలుస్తారు?

A) నాగ్‌పూర్
B) ఉదయ్ పూర్
C) కాన్పూర్
D) జైపూర్

63. మొక్కల పత్రాలు పచ్చ రంగులో ఉండడానికి కారణం -

A) పత్రహరితం
B) 'అల్బుమిన్'
C) 'కెరోటిన్'
D) 'గ్లోబులిన్'

64. పశువులలో నోటి మరియు పాదాల వ్యాధులు దీని కారణంగా వస్తాయి -

A) వైరస్
B) పెన్నిసిలియమ్
C) శిలీంధ్రాలు
D) బ్యాక్టీరియా

65. నీటి కింద పోగుపడిన వృక్ష పదార్థాలని ఎనిరోబిక్ బ్యాక్టీరియా ఆక్సిజన్ లేకుండా కుళ్లింపజేయడం వల్ల ఏ శిలాజ ఇంధనం ఏర్పడుతుంది?

A) సహజ వాయువు
B) బొగ్గు
C) ముడి చమురు
D) పెట్రోల్

66. 250 C వద్ద నీటి భౌతిక రూపం ఎలా ఉంటుంది?

A) ప్లాస్మా
B) ద్రవం
C) ఘనం
D) వాయువు

67. ఏడాదికి 4.5% చొప్పున 4 సంవత్సరాల 6 నెలల కాలానికి రూ. 2400 మీద లభించే సరళ వడ్డీ ఎంత?

A) రూ.816
B) రూ.926
C) రూ.486
D) రూ.796

68. X అనే పదార్థం ఎర్ర లిట్మస్‌ని నీలంగా మారుస్తుంది, అది మిథైల్ ఆరంజ్‌ని ఇలా మారుస్తుంది -

A) పసుపు
B) రంగు ఉండదు
C) ఎరుపు
D) గులాబీ

69. ఒక నిర్థిష్ట కోడ్ లో, 'BRACKET'ని 'DPCAMCV' అని వ్రాశారు. ఆ భాషలో 'BLOCK'ని ఎలా వ్రాస్తారు?

A) DJQAM
B) DIQAM
C) DJQAN
D) DJPAM

70. సరళీకరించండి: (1 ÷ 0.08)

A) 12.5
B) 25
C) 125
D) 2.5

71. 'నారింజ' ని 'వెన్న' అని, 'వెన్న'ని 'సబ్బు' అని, సబ్బు'ని 'సిరా' అని, 'సిరా'ని 'తేనె' అని మరియు 'తేనె'ని 'నారింజ' అని పిలిస్తే, క్రింది వాటిలో దుస్తులు ఉతకడానికి దేనిని ఉపయోగిస్తారు?

A) సిరా
B) నారింజ
C) తేనె
D) సబ్బు

72. 15, 25, 40 మరియు 75తో భాగించబడే గరిష్ఠ 4 అంకెల సంఖ్యని కనుగొనండి.

A) 9200
B) 9400
C) 9000
D) 9600

73. ఇచ్చిన రంగు మరియు ఇచ్చిన యానకాల జతలో పతన కోణం యొక్క సైన్ నిష్పత్తి అనేది పరావర్తన కోణం యొక్క సైన్‌కి స్థిరాంకంగా ఉంటుందని చెప్పే సూత్రమేది?

A) స్నెల్స్ సూత్రం
B) ఓమ్స్ సూత్రం
C) న్యూటన్ సూత్రం
D) గాస్ సూత్రం

74. భారతీయ సుగంధ ద్రవ్యాల పరిశ్రమ యొక్క ఎదుగుదల మరియు చరిత్ర గురించి పర్యాటకులకు అవగాహన కల్పించడం కొరకు భారతదేశపు మొదటి సుగంధ ద్రవ్యాల సంగ్రహాలయం దిగువ పేర్కొన్న ఏ నగరాల్లో ఏర్పాటు చేయబడింది?

A) తిరువనంతపురం
B) హైదరాబాద్
C) పనాజి
D) కొచ్చి

75. CH3 CH2 CH3 సమ్మేళనం యొక్క IUPAC పేరు:

A) ప్రొపేన్
B) పెంటేన్
C) మీథేన్
D) బ్యూటేన్

76. లోహ కార్బోనేట్‌తో ఆమ్లం చర్య జరిపినప్పుడు _______ ఏర్పడుతుంది/తాయి.

A) నీరు
B) ఐచ్చికలు అన్నీ
C) కార్బన్ డయాక్సైడ్
D) ఉప్పు

77. cos² x + sin x = 5/4 అయితే, 'sin x' విలువ కనుగొనండి.

A) 3/4
B) -1/2
C) 3/2
D) 1/2

78. రావణ-1 అనేది ఏ దేశానికి చెందిన మొట్టమొదటి పరిశోధనా ఉపగ్రహం?

A) భారతదేశం
B) శ్రీలంక
C) ఇండోనేషియా
D) చైనా

A) k-2
B) √k-2
C) √k+2
D) k + 2

A) 4, 10
B) 8, 5
C) 5, 4
D) 2, 20

81. మిగిలిన నక్షత్రాలన్నీ తూర్పు నుంచి పశ్చిమానికి కదులుతున్నట్టు కనిపిస్తుంటే, దృవ నక్షత్రం మాత్రం ఒకే స్థానంలో స్థిరంగా ఉన్నట్టు కనిపించడానికి కారణమేమిటి?

A) ధృవ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుంది
B) ధృవ నక్షత్రం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది
C) భూమి తిరిగే అక్షం దిశలోనే ధృవ నక్షత్రం ఉంది కాబట్టి
D) దృవ నక్షత్రం ఒక గ్రహం కాబట్టి

82. క్రింది వారిలో 2019 లో అస్సాం లోని ధుబ్రీ జిల్లాలో ఉన్న 61 కి.మీ. భారత-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి అత్యాధునిక ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థని ప్రారంభించినది ఎవరు?

A) నిర్మలా సీతారామన్
B) రాజ్‌నాథ్ సింగ్
C) నరేంద్ర మోడీ
D) పియూష్ గోయల్

83. ఇచ్చిన ఐచ్చికాల నుండి భిన్నమైనదానిని కనుగొనుము.

A) GJOV
B) HKPW
C) JMRY
D) CGKR

84. శ్రేణిని పూర్తి చేయండి.
9, 12, 10, 13, 11, (...)

A) 16
B) 12
C) 14
D) 15

85. మూలకాలు, సంకేతాలు మరియు యూనిట్ల పేర్లని క్రింది ఏ అంతర్జాతీయ వైజ్ఞానికి సంస్థ ఆమోదిస్తుంది?

A) 'ఇంటర్నేషనల్ సైన్స్ కౌన్సిల్'
B) 'ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ'
C) 'యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్'
D) 'ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోడెసీ మరియు జియోఫిజిక్స్'

 

A) 15
B) 8
C) 30
D) 24

87. క్రింది వాటిలో భౌతిక మార్పు కానిది ఏది?

A) ఘనాలను ద్రవాలుగా కరిగించడం
B) ద్రవాల ఆవిర్లను వాయువులుగా మార్చడం
C) ద్రవాలుగా మార్చడానికి వాయువులను కరిగించడం
D) పదార్థాల కిణ్వప్రక్రియ

88. 'n' అనే సహజ సంఖ్యని 4తో భాగిస్తే, 3 శేషంగా వస్తుంది. (2n + 3) ని 4తో భాగిస్తే వచ్చే శేషం ఎంత?

A) 3
B) 0
C) 2
D) 1

89. రాజేంద్ర ప్రసాద్ తర్వాత భారత రాష్ట్రపతి పదవిని ఎవరు చేపట్టారు?

A) V.V. గిరి
B) S. రాధాకృష్ణన్
C) జ్ఞాని జైల్ సింగ్
D) N. సంజీవ రెడ్డి

90. కాళ్లు విపరీతంగా వాచిపోవడానికి కారణమయ్యే వ్యాధి ఏది?

A) క్షయ
B) కుష్టు
C) కలరా
D) 'ఎలిఫెంటాసిస్'

91. క్లోరోఫామ్ యొక్క అణు సూత్రమేమిటి?

A) CH4
B) CHCl3
C) CCl4
D) C2H6

93. పుటాకార కటకపు ప్రధానాక్షానికి సమాంతరంగా ఉండే వస్తువు నుంచి వచ్చే ఒక కాంతి కిరణం వక్రీభవనం తర్వాత కటకం యొక్క అదే పార్శ్వం మీద ఏ బిందువు నుంచి అపసరణం చెందినట్టు కనిపిస్తుంది?

A) ప్రధాన నాభి
B) వక్రతా కేంద్రం మరియు నాభి మధ్య బిందువు
C) వక్రతా కేంద్రము
D) దృష్టి కేంద్రం మరియు నాభి మధ్య బిందువు

94. తండ్రి మరియు కుమారుడి వయస్సులు 3 : 1 నిష్పత్తిలో ఉన్నాయి. వారి వయస్సుల లబ్ధము 147. వారి వయస్సుల మొత్తం ఎంత?

A) 32
B) 36
C) 28
D) 35

95. 'INS విక్రమాదిత్య' అనేది ఒక -

A) జెట్ యుద్ధ విమానం
B) విమాన వాహక నౌక
C) జలాంతర్గామి
D) ప్రధాన యుద్ధ ట్యాంక్

96. క్రింది వాటిలో అంటు వ్యాధి కానిది ఏది?

A) మధుమేహం
B) కలరా
C) మలేరియా
D) తట్టు

97. 25 వస్తువుల కొనుగోలు ధర అనేది 20 వస్తువుల అమ్మకం ధరకి సమానం. లాభ శాతం కనుగొనండి?

A) 50%
B) 30%
C) 40%
D) 25%

98. గాలిలో కాంతి వేగం ఎంత?

A) 3 x 106 m/s
B) 3 x 108 m/s
C) 3 x 104 m/s
D) 3 x 105 m/s

99. తెల్లటి కాంతిలోని ఏ రంగు గరిష్ట తరంగధైర్ఘ్యం కలిగి ఉంటుంది?

A) పచ్చ
B) నారింజ
C) ఎరుపు
D) ఉదా

download

Click Here To Download PDF

Study Kit for RRB Junior Engineer EXAM (Phase-1)

ANSWER:-

1. (d), 2. (d), 3. (a), 4. (a), 5. (a), 6. (a), 7. (d), 8. (b), 9. (b), 10. (c)
11. (a), 12. (a), 13. (a), 14. (b), 15. (a), 16. (d), 17. (a), 18. (d), 19. (b), 20. (a)
21. (a), 22. (c), 23. (a), 24. (c), 25. (d), 26. (b), 27. (a), 28. (d), 29. (c), 30. (c)
31. (a), 32. (b), 33. (c), 34. (a), 35.(a), 36. (a), 37. (a), 38. (b), 39. (c), 40. (a)
41. (d), 42. (c), 43. (a), 44. (d), 45. (c), 46. (c), 47.(a), 48. (d), 49. (a), 50. (a)
51. (c), 52. (a), 53. (a), 54. (b), 55. (c), 56. (a), 57. (c), 58. (c), 59. (a), 60. (b)
61. (b), 62. (d), 63. (a), 64. (a), 65. (a), 66. (d), 67. (c), 68. (a), 69. (a), 70. (a)
71. (a), 72. (d), 73. (a), 74. (d), 75. (a), 76. (b), 77. (d), 78. (b), 79. (b), 80. (a)
81. (c), 82. (b), 83. (d), 84. (c), 85. (b), 86.(c), 87. (d), 88. (d), 89. (b) 90. (d) 
91. (b), 92. (a), 93. (a), 94. (c), 95. (b), 96. (a), 97. (d), 98. (b), 99. (c)



 

 

IMPORTANT: RRB EXAM PORTAL is NOT associated with Railway Recruitment Board(RRB) or Indian Railways, For RRB official website visit - www.rrcb.gov.in