IMPORTANT: RRB EXAM PORTAL is NOT associated with Railway Recruitment Board(RRB) or Indian Railways.

: Disclaimer :

RRB EXAM PORTAL is NOT associated with Railway Recruitment Board or Indian Railways.
For RRB official website visit - www.rrcb.gov.in

(Download) RRB JE Paper (TELUGU) 24-may-2019 Shift-3

(Download) RRB JE Paper (TELUGU) 24-may-2019 Shift-3

1. క్రింద ఇచ్చిన ఐచ్ఛికాల నుంచి భిన్నమైన దానిని ఎంచుకోండి.

A) 177
B) 153
C) 159
D) 121

2. యానకపు సాంద్రతలో ఒక ధ్వని తరంగం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని ఇలా పిలుస్తారు?

A) భ్రమణ కాలం
B) తరంగధైర్ఘ్యం
C) పౌనఃపున్యం
D) డోలన పరిమితి

3. 'మిస్టర్ యూనివర్స్ టైటిల్' గెలుచుకున్న భారతదేశపు మొట్టమొదటి 'బాడీబిల్డర్' ఎవరు?

A) మనోహర్ ఐచ్
B) మోనోతోష్ రాయ్
C) మొలాయ్ రాయ్
D) ప్రేమ్ చంద్

4. మానవ శరీరంలో పియూష గ్రంధి (pituitary gland) ఎక్కడ ఉంటుంది?

A) మూత్రపిండాలకి పైన
B) మెదడు ఆధారం వద్ద
C) ప్లీహానికి దగ్గరగా
D) ప్రేగుల్లో

5. ఎత్తు 24 సెం.మీ మరియు మందం 1 సెం.మీతో ఒక బోలు స్థూపం తయారీకి ఉపయోగించిన పదార్థ ఘనపరిమాణం 96π. దాని అంతర్గత మరియు బాహ్య వ్యాసార్థాల మొత్తం ఎంత?

A) 7 సెం.మీ
B) 4 సెం.మీ
C) 5 సెం.మీ
D) 3 సెం.మీ

6. ఇనుప లోహంతో కాపర్ సల్ఫేట్‌ చర్య జరిపితే రాగి లోహం ఏర్పడుతుంది. క్రింది వాటిలో ఏ చర్య దీనికి వర్తిస్తుంది?

A) సమ్మేళన చర్య
B) విచ్ఛిన్న చర్య
C) ఏక స్థానభ్రంశ చర్య
D) ద్వంద్వ స్థానభ్రంశ చర్య

7. రాజా రవి వర్మ ఏ రంగంలో ప్రసిద్ధుడు?

A) సాహిత్యం
B) చిత్రలేఖనం
C) నృత్యం
D) సంగీతం

8. మానవ శరీరంలోని ఏ కండరం రెండు చివర్లలోనూ అతికి ఉండదు?

A) ద్విశిర కండరం (Biceps)
B) నాలుక
C) 'ట్రైసెప్స్'
D) 'అడక్టర్'

9. క్రింది వాటిలో క్షారం కానిది ఏది?

A) NaOH 
B) KOH
C) NH4OH
D) C2H5OH

10. క్రింద ఇచ్చిన సంబంధాన్ని ఏది ఉత్తమంగా పూర్తి చేస్తుంది?
FDA : MKH :: QOL : ?

A)  XSV
B) SVX
C) XVS
D) QUZ

11. P, Q మరియు R వయసులు 4 : 7 : 9 నిష్పత్తిలో ఉన్నాయి. 8 సంవత్సరాల క్రితం R వయసు Q ప్రస్తుత వయసుకి సమానంగా ఉండేది. ప్రస్తుతం వారి వయసుల మొత్తం ఎంత?

A)  80
B)  100
C)  60
D)  50

12. శ్రేణిని పూర్తి చేయండి.
0.7, 0.75, 0.85, 1, (…)

A)  1.8
B) 1.2
C) 1.6
D) 1.1

13.ఇచ్చిన శ్రేణిలో తప్పుడు సంఖ్యను కనుగొనండి.
12, 18, 27, 42, 62, 87

A) 27
B) 42
C) 18
D) 87

14. ఒకే లాంటి రెండు వస్తువులను ఒక్కొక్కటీ రూ. 200 చొప్పున అమ్మడం ద్వారా ఒక దాని మీద 10% లాభం మరియు ఒక దాని మీద 10% నష్టం వచ్చింది. నికర నష్టం లేదా లాభం శాతం ఎంత?

A) 2% నష్టం
B) 1% నష్టం
C) 2% లాభం
D) 1% లాభం

15. యొక్క విలువను కనుగొనండి 1 / 1x2 + 1 / 2x3 + 1 / 3x4 + 1 / 4x5 + 1 / 5x6 + .... + 1 / 9 x 10

A) 5/11
B) 2/5
C) 9/10
D) 1/10

16. క్రింది ఏ లోహం మూలకాల ఆవర్తన పట్టికలో అత్యంత తేలికైనది?

A) మెగ్నీషియం
B) లిథియం
C) టైటానియమ్
D) అల్యూమినియం

17. 'THRASH' ని 'UGSZTG'గా సంకేతీకరిస్తే, 'HEAD'ని ఎలా సంకేతీకరిస్తారు?

A) GDBC
B) GDZC
C) IDBC
D) IECD

18. క్రింది పేర్కొన్న ఏది 1 mA కొలతకు సమానం?

A) 103 A
B) 10-3 A
C) 106A
D) 10-6 A

19. సమీకరణాన్ని సరిగ్గా చేయడానికి వీలుగా ఐచ్చికల నుండి సంకేతాల సరైన క్రమాన్ని ఎంచుకోండి.
18 - 5 x 50 = 40

A) -, x, =
B) x, -, =
C) =, -, x
D) x, =, -

20. ఆర్కిమెడిస్ సూత్రం కనిపెట్టిన తర్వాత ఆర్కిమెడిస్ దేనిని నిర్ణయించాడు?

A) చక్రవర్తి కిరీటంలోని బంగారం స్వచ్ఛత
B) నౌక రూపకల్పన భావన
C) పాల స్వచ్ఛత
D) జలంతర్గామి రూపకల్పన భావన

21. ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి మరియు దాని క్రింద ఇచ్చిన ప్రశ్నకి సమాధానమివ్వండి.

A, B, C, D, E, F, G మరియు H అనే ఎనిమిది మంది స్నేహితులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ దాని కేంద్రానికి ఎదురుగా ఉండే విధంగా కూర్చుని ఉన్నారు. డైకిన్, శ్యాంసంగ్, బ్లూస్టార్, గోద్రేజ్, ఒనిడా, పానసోనిక్, వోల్టాస్ మరియు విర్ల్‌పూల్ అనే ఎయిర్ కండీషనర్ బ్రాండ్‌లలో ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి ఇష్టం. అయితే, వాళ్లందరూ మొదట చెప్పిన క్రమంలోనే కూర్చుని ఉన్నారని అనుకోవాల్సిన అవసరం లేదు.

A అనే వ్యక్తి విర్ల్‌పూల్ ఇష్టపడే వ్యక్తికి కుడివైపు మూడవ స్థానంలో కూర్చుని ఉన్నాడు. A అనే వ్యక్తికి బ్లూ స్టార్ నచ్చదు. E అనే వ్యక్తి H పక్కన కూర్చోలేదు. C అనే వ్యక్తి బ్లూ స్టార్ ఇష్టపడే వ్యక్తికి కుడివైపు పక్కనే కూర్చుని ఉన్నాడు. A గానీ, H గానీ ఒనిడా లేదా శ్యాంసంగ్ ఇష్టపడరు. ఒనిడా ఇష్టపడే వ్యక్తి విర్ల్‌పూల్ ఇష్టపడే వ్యక్తికి పక్కన కూర్చోలేదు. డైకిన్ ఇష్టపడే వ్యక్తి E అనే వ్యక్తికి ఎడమవైపు రెండవ స్థానంలో కూర్చుని ఉన్నాడు. డైకిన్ ఇష్టపడే వ్యక్తి పానసోనిక్ మరియు వోల్టాస్ ఇష్టపడే వ్యక్తులు ఇద్దరికీ పక్కన ఉండేలా కూర్చుని ఉన్నాడు. వోల్టాస్ ఇష్టపడే వ్యక్తి B అనే వ్యక్తికి కుడివైపు మూడవ స్థానంలో కూర్చుని ఉన్నాడు. Bకి ఒనిడా నచ్చదు. F అనే వ్యక్తి A పక్కన కూర్చోలేదు. G అనే వ్యక్తి డైకిన్ ఇష్టపడే వ్యక్తి పక్కన కూర్చోలేదు. వోల్టాస్ ఇష్టపడే వ్యక్తికి మరియు Hకి మధ్యలో ఇద్దరు మాత్రమే కూర్చుని ఉన్నారు. ఒనిడా మరియు శ్యాంసంగ్ ఇష్టపడే వ్యక్తులు ఒకరికొకరు పక్కపక్కనే కూర్చుని ఉన్నారు.

క్రింది వారిలో ఎవరు Aకి పక్కనే కూర్చుని ఉన్నారు?

A) G
B) D
C) B
D) H

22. క్రింది వాటిలో దేని కారణంగా పత్రాలకి పచ్చటి రంగు వస్తుంది?

A) పత్రహరితం
B) యూరియా
C) నీరు
D) నైట్రోజన్

23. మానవుని చెవిలోని ఏ భాగం అది గ్రహించిన ధ్వనికి అనుగుణంగా ప్రకంపనం చెందుతుంది?

A)  కర్ణభేరి త్వచం (Tympanic membrane)
B) 'పిన్నా'
C) శ్రవణ నాడి (Auditory nerve)
D) 'హ్యామర్'

24. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి 'ఫైబర్ గ్రిడ్ ఇంటర్నెట్' వ్యవస్థను ప్రవేశపెట్టారు?

A) చంద్రబాబు నాయుడు
B) అరవింద్ కేజ్రీవాల్
C) రమణ్ సింగ్
D) మనోహర్ పారికర్

25. 4% మరియు 6% లాభంలో ఒక వస్తువు యొక్క అమ్మకపు ధరలకు మధ్య ఉన్న నగదు వ్యత్యాసం రూ. 3. రెండు అమ్మకపు ధరల నిష్పత్తిని కనుగొనండి.

A) 51 : 52
B) 51 : 53
C) 52 : 55
D) 52 : 53

26. శబ్ధ తరంగం యొక్క కంపన పరిమితి దీనిపై ఆధారపడి ఉంటుంది -

A) వస్తువు పదార్థం
B) వస్తువు ఉష్ణోగ్రత
C) వస్తువుని కంపనం చెందించే బలం
D) వస్తువు నాణ్యత

27. 4 : 5 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల క.సా.గు (LCM) 180. వాటి మొత్తం ఎంత?

A) 90
B) 72
C) 70
D) 81

28. ఒక సంఖ్యని 234తో భాగిస్తే, 36 శేషంగా వచ్చింది. అదే సంఖ్యని 13తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది?

A) 9
B) 6
C) 11
D) 10

29. 'వ్యక్తిగత సత్యాగ్రహాన్ని' పాటించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?

A) గోవింద్ వల్లభ్ పంత్
B) సర్దార్ వల్లభభాయ్ పటేల్
C) మహాత్మా గాంధీ
D) వినోబా భావే

30. క్రింది ఏ నగరంలో మానవ అంతరిక్ష వైమానిక కేంద్రాన్ని ISRO 2019లో ప్రారంభించింది?

A) బెంగళూరు
B) ముంబై
C) హైదరాబాద్
D) చెన్నై

31. సరళీకృతం: -√25+10√6 + √25-10√6

A) √50
B) 2√15
C) √55
D) 2√5

32. మానవ రక్తంలోని చక్కెర స్థాయిని ఏ హార్మోన్ నియంత్రిస్తుంది?

A)  ఇన్సూలిన్
B)  పారాథోర్మోన్
C)  ఈస్ట్రోజన్
D)  టెస్టోస్టిరాన్

33. భూపటలంలో అత్యంత సంవృద్ధిగా ఉండే రెండవ లోహం ఏది -

A) అల్యూమినియం
B) సిలికాన్
C) ఇనుము
D) ఆక్సిజన్

34. tan α = 1/2, tan β = 1/3 అయితే, α + β విలువ కనుగొనండి.

A) 90°
B) 45°
C) 0°
D) 135°

35. 3 సంవత్సరాల్లో 10% రేటు వద్ద చక్రవడ్డీ మరియు సరళ వడ్డీ మధ్య తేడా ఎంత పెట్టుబడి మీద రూ. 620 కు సమానం అవుతుంది?

A) రూ.25000
B) రూ.24000
C) రూ.18000
D) రూ.20000

36. ధ్వని తరంగాల ప్రతిధ్వని ద్వారా ధ్వని పునరావృతం కావడాన్ని ఇలా పిలుస్తారు -

A) ప్రతిధ్వని
B) చప్పుడు
C) 'నోట్'
D) 'డబుల్'

37. ఈ ప్రశ్నలో, రెండు వ్యాఖ్యానాలు వాటిని అనురించి రెండు తీర్మానాలు ఇవ్వబడినాయి. తార్కికంగా ఏ తీర్మానం(నాలు) ఉత్తమంగా సరిపోతుందో(తాయో) ఎంపిక చేసుకోండి.

వ్యాఖ్యానాలు:
1) అన్ని పుష్పాలు కొవ్వొత్తులు.
2) ఏ కొవ్వొత్తీ లాంతరు కాదు.

తీర్మానాలు:
I. ఏ పుష్పమూ లాంతరు కాదు.
II. అన్ని కొవ్వొత్తులూ పుష్పాలు.

A) తీర్మానం I లేదా II అనుసరించడం లేదు
B) తీర్మానం I మరియు II రెండూ అనుసరిస్తున్నాయి
C) తీర్మానం I మాత్రమే అనుసరిస్తోంది
D) తీర్మానం II మాత్రమే అనుసరిస్తోంది

38. 10వ ద్వైవార్షిక అంతర్జాతీయ ప్రదర్శన మరియు సదస్సు "ఇండియా కెమ్ 2018" ఏ నగరంలో జరిగింది?

A) కోల్కతా
B) చెన్నై
C) ఢిల్లీ
D) ముంబై

39. ఈ ప్రశ్నలో, ఒక వ్యాఖ్యానం ఇవ్వబడింది. దానిని అనుసరిస్తూ రెండు తీర్మానాలు కూడా ఇవ్వబడ్డాయి. ఇచ్చిన వ్యాఖ్యానానికి తార్కికంగా సరిపోయే తీర్మానం(లు) ఎంచుకోండి.

వ్యాఖ్యానం:
ఈ ప్రపంచం మంచిది కాదు, రాక్షసమైనది కాదు; ప్రతి వ్యక్తి తనదైన ప్రపంచాన్ని తయారు చేస్తాడు.

తీర్మానాలు:
I. కొందరు వ్యక్తులు ఈ ప్రపంచాన్ని మంచిదిగా భావిస్తారు.
II. కొందరు వ్యక్తులు ఈ ప్రపంచాన్ని చెడ్డదిగా భావిస్తారు.

A) తీర్మానం I మాత్రమే అనుసరిస్తోంది.
B) తీర్మానం I మరియు II అనుసరిస్తున్నాయి
C) తీర్మానం I లేదా II అనుసరిస్తోంది
D) తీర్మానం II మాత్రమే అనుసరిస్తోంది

40. క్రింది శ్రేణిలో లోపించిన అక్షరాల గ్రూపును కనుగొనండి.
VA, ND, (…), DP, BY

A) TU
B) SE
C) HI
D) NR

41. శ్రేణిని పూర్తి చేయండి.
168, 151, 134, 117, (…)

A) 97
B) 95
C) 100
D) 82

42. లాంథనాయిడ్లు మరియు యాక్టినాయిడ్లని ___________ అని కూడా పిలుస్తారు.

A) అంతర్గత మార్పు మూలకాలు
B) సాధారణ మూలకాలు
C) రూపాంతర మూలకాలు
D) ఉత్కృష్ట వాయువులు

43. పుట్టగొడుగు అనేది ఒక -

A) స్లైమ్ మౌల్డ్
B) శిలీంధ్రం
C) మొక్క
D) జంతువు

44. ఇచ్చిన ఐచ్చికాల నుండి భిన్నమైనదానిని కనుగొనుము.

A) 13
B) 7
C) 9
D) 11

45. అమిందివి మరియు మినికోయ్ లు భారతదేశపు ఏ కేంద్రపాలిత ప్రాంతంలో భాగాలుగా ఉన్నాయి?

A) ఛండీగఢ్
B) లక్షద్వీప్
C) అండమాన్ మరియు నికోబార్
D) డామన్ మరియు డయ్యూ

46. మానవ మృతదేహాన్ని విచ్చేధన చేసి మరియు అధ్యయనం చేసే ప్రక్రియని వైద్య సంబంధిత చట్టాల్లో ఏ పేరుతో పిలుస్తారు?

A) 'ఆటోలెప్సి'
B) 'అనాలసిస్'
C) 'అటాప్సీ'
D) 'కాసా మెడికో'

47. క్రింది జంట ప్రదర్శిస్తున్న అదే విధమైన సంబంధం ప్రదర్శించే ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
కలరా : నీరు

A) ఔషధం : వ్యాధి
B) మలేరియా : దోమ
C) విషం : మరణం
D) పిల్లి : ప్లేగు

48. 120 మీ ఒక వృత్తాకార ట్రాక్ చుట్టూ P మరియు Q ఒకే సమయంలో, ఒకే స్థానం నుంచి వరుసగా 20 మీ/ని మరియు 12 మీ/ని వేగాలతో పరుగెత్తారు. ఎన్ని స్థానాల్లో వాళ్లిద్దరూ  కలుసుకుంటారు?

A) 2
B) 4
C) 3
D) 1

Study Kit for RRB Junior Engineer EXAM (Phase-1)

49. సాధారణ వేగంలో 3/4 వంతు వేగంతో ప్రయాణించడం ద్వారా, ఒక వ్యక్తి తన పని ప్రదేశానికి 15 నిమిషాలు ఆలస్యంగా చేరాడు. పని ప్రదేశం చేరడానికి అతను సాధారణంగా తీసుకునే సమయం ఎంత?

A) 30 నిమిషాలు
B) 60 నిమిషాలు
C) 42 నిమిషాలు
D) 45 నిమిషాలు

50. ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి మరియు దాని క్రింద ఇచ్చిన ప్రశ్నకి సమాధానమివ్వండి.

A, B, C, D, E, F, G మరియు H అనే ఎనిమిది మంది స్నేహితులు ఒక సమావేశం కోసం ఒక వృత్తాకార బల్ల చుట్టూ దాని కేంద్రానికి ఎదురుగా ఉండేలా కూర్చుని ఉన్నారు. Bకి కుడివైపు మూడవ స్థానంలో కూర్చుని ఉన్న Gకి కుడివైపు రెండవ స్థానంలో A కూర్చుని ఉన్నాడు. G మరియు A మధ్యలో కూర్చుని ఉన్న Fకి ఎడమవైపు రెండవ స్థానంలో D కూర్చుని ఉన్నాడు. B లేదా E పక్కన C కూర్చోలేదు.

Bకి ఎడమవైపు పక్కనే ఎవరు కూర్చుని ఉన్నారు?

A) H
B) E
C) D
D) C

51. A వయసు : B వయసుల నిష్పత్తి 4 : 3గా ఉంది. 6 సంవత్సరాల తర్వాత, A వయసు 26 సంవత్సరాలు. B యొక్క ప్రస్తుత వయసెంత?

A) 9
B) 12
C) 18
D) 15

52. క్రింది వాటిలో దేనిని మద్యపానమైన సారాలో ఉపయోగిస్తారు?

A)  'మిథనాల్'
B) 'ఇథనాల్'
C) 'ప్రొపనోల్'
D) 'బ్యూటనాల్'

53. భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం (National Park) ఏది?

A) కాజీరంగా జాతీయ ఉద్యానవనం
B) కన్హా జాతీయ ఉద్యానవనం
C) గిర్ జాతీయ ఉద్యానవనం
D) జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం

54. ఆర్థరైటీస్ అనే వ్యాధి దీనిని ప్రభావితం చేస్తుంది -

A) మూత్రపిండాలు
B) మెదడు
C) ఊపిరితిత్తులు
D) కీళ్లు

55. ఇచ్చిన చిత్రంలో ప్రశ్న గుర్తు (?) ను ఉత్తమంగా భర్తీ చేసే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.

A) 25
B) 32
C) 34
D) 30

56. వీరిలో ఒక టెస్ట్ మ్యాచ్‌లో భారతదేశం తరపున సెంచరీ చేసిన తొలి క్రికెటర్ ఎవరు?

A)  దీపక్ షోధాన్
B) లాలా అమర్ నాథ్
C) సురీందర్ అమర్ నాథ్
D) హనుమంత్ సింగ్

57. నికెల్ ఉత్ప్రేరకం ఉపయోగించి వెజిటేబుల్ ఆయిల్ హైడ్రోజనీకరణ చేసేటప్పుడు సాధారణంగా క్రింది చర్యని ఉపయోగిస్తారు?

A) ఆక్సీకరణ చర్య
B) ప్రతిక్షేపణ చర్య
C) జోడింపు చర్య
D) స్థానభ్రంశ చర్య

58. రాజ్యాంగంలోని క్రింది ఏ భాగం కేంద్ర పాలిత ప్రాంతాలకు అనుబంధం కలిగి ఉంటుంది?

A) భాగం VIII
B) భాగం IX
C) భాగం VI
D) భాగం IV

59. 'ROPE' ని 6821గా మరియు 'CHAIR'ని 73456గా సంకేతీకరిస్తే, 'CRAPE'ని ఎలా సంకేతీకరిస్తారు?

A) 77123
B) 77246
C) 76421
D) 73456

60. ఒక సంఖ్య నుంచి 1/7 వంతు తీసివేస్తే, వచ్చే ఫలితము ఆ సంఖ్య కంటే 30 తక్కువగా ఉంటుంది. ఆ సంఖ్యని కనుగొనండి.

A) 210
B) 120
C) 140
D) 105

61. నాభ్యాంతరం 1 మీ. గా ఉండే కటక సామర్థ్యం ఎంత?

A) 1D
B) 4D
C) 2 D
D) 3D

62. సంవత్సరాల్లో మొత్తం 4 రెట్లు మారితే సాధారణ వడ్డీ రేటు ఎంత?

A) 20%
B) 40/3%
C) 10%
D) 15%

63. వైపు 6 సెం.మీ. యొక్క సాధారణ షడ్భుజి యొక్క వైశాల్యం ఏమిటి?

A) 54√3 cm²
B) 108√3 cm²
C) 64√3 cm²
D) 72√3 cm²

64. మూడు వంతుల చంద్రుడు మాత్రమే కనిపిస్తుంటే, దానిని ఏమని పిలుస్తారు?

A) గుబ్బగా ఉండే చంద్రుడు (Gibbous moon)
B) అర్ధ చంద్రుడు
C) నెలవంక
D) పూర్ణ చంద్రుడు

65. X- 1 / x = 3 అయితే, X4 + 1 / X4 విలువను కనుగొనండి

A) A) 129
B) 123
C) 119
D) 14

66. P మరియు Q ఒక వ్యాపారంలో 5 : 13 నిష్పత్తితో పెట్టుబడి పెట్టారు. Q తన పెట్టుబడిని 6 నెలల తర్వాత వెనక్కి తీసుకున్నాడు. వాళ్లు లాభాన్ని 25 : 26 నిష్పత్తిలో పంచుకుంటే, P తన పెట్టుబడిని ఎంతకాలం వ్యాపారంలో ఉంచాడు?

A) 8 నెలలు
B) 15 నెలలు
C) 12 నెలలు
D) 18 నెలలు

67. 420 లోని ఏడింట నాలుగు వంతులు అనేది 200 లోని ఐదింట మూడు వంతుల కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది?

A) 80
B) 120
C) 60
D) 90

68. శ్రేణిని పూర్తి చేయండి.
1, 3, 7, 15, 31, (…)

A) 63
B) 127
C) 39
D) 47

69. ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి

A) A)20
B)16
C)24
D)12

70. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక సూత్రం ఏమిటి?

A) CCl4
B) CaCl2
C) CaOCl2
D) Ca(OH)2

71. P, Q, R మరియు S ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. P మరియు Q కలసి అదే పనిని 50 రోజుల్లో, R ఒక్కడే 60 రోజుల్లో చేయగలడు. S ఒంటరిగా ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది?

A) 60
B) 65
C) 90
D) 75

72. P, Q మరియు R ఒక పనిని వరుసగా 15, 20 మరియు 30 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే, ఒక పని త్వరగా ముగించడం కోసం వారి ముగ్గుర్లో ఇద్దర్ని మాత్రమే ఎంచుకోవాలని కాంట్రాక్టర్ నిర్ణయించుకున్నాడు. ఈ ఎంపికలలో ఏది ఉత్తమమైనది.

A) RP
B) PQ లేదా QR ఏదో ఒకటి
C) QR
D) PQ

73. ఒక ప్రదేశంలో నిర్వహించిన సర్వే ప్రకారం, అక్కడ 50% మంది A అనే వార్తా పత్రిక చదువుతారు. 40% మంది B అనే వార్తా పత్రిక చదువుతారు. అలాగే, 20% మంది A వార్తా పత్రిక గానీ, B వార్తా పత్రిక గానీ చదవరు. A మరియు B వార్తా పత్రికలు రెండూ చదివే వారి సంఖ్య 500 అయితే, ఎంత మందిపై సర్వే నిర్వహించారు?

A) 3000
B) 4500
C) 5000
D) 7000

74. అర్జున పురస్కారం అందుకున్న భారతదేశపు మొట్టమొదటి కాలిబంతి ఆటగాడు (footballer) ఎవరు?

A) జర్నైల్ సింగ్
B) P.K. బెనర్జీ
C) సైలెన్ మన్నా
D) తులసీదాస్ బలరామ్

75. జంతువులకి వాటి పర్యావరణంతో ఉండే సంబంధం గురించిన అధ్యయనాన్ని ఇలా పిలుస్తారు -

A) 'ఎంటమాలజీ'
B) 'ఎకాలజీ'
C) 'ఎథాలజీ'
D) 'క్లైమటాలజీ'

76. P మరియు Q కలసి ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలరు. Q మరియు R కలసి అదే పనిని 24 రోజుల్లో, R మరియు P కలసి 20 రోజుల్లో పూర్తి చేయగలరు. వాళ్లందరూ కలసి పనిచేస్తే, ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది?

A) 15
B) 25
C) 16
D) 8

77. అణు విద్యుత్ కేంద్రాల్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించి, విచ్ఛిన్నం కోసం వాటిని అనుకూలంగా మార్చడానికి ఏ పదార్థాన్ని మితకారిగా ఉపయోగిస్తారు?

A) సిలికాన్
B) బెరీలియం
C) గ్రాఫైట్
D) బోరాన్

78. (22 × 32 × 5 × 7), (22 × 3 × 52 × 7) మరియు (2 × 3 × 5 × 7) యొక్క క.సా.గు (LCM) కనుగొనండి.

A) 7200
B) 6300
C) 8400
D) 9000

79. ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య కేంద్రకంలోని _____ సంఖ్యకు సమానం.

A) ఎలక్ట్రాన్
B) న్యూట్రాన్లు
C) ప్రోటాన్
D) ఎలక్ట్రానులు మరియు ప్రోటాన్లు

80. సరళీకరించండి: sin (A + B) sin(A - B)

A) cos 2A
B) sin² A - sin² B
C) sin² A + sin² B
D) cos² A - cos² B

81. ఒక వస్తువు కదలడం ప్రారంభమై, దాని మీద ఎలాంటి ఘర్షణ పనిచేయకపోతే ఏం జరుగుతుంది?

A) కొంతసేపటి తర్వాత ఆ వస్తువు ఆగిపోతుంది
B) వస్తువు ఎగరడం ప్రారంభిస్తుంది
C) వస్తువు ఆగనే ఆగలేదు
D) వస్తువు వెంటనే ఆగిపోతుంది

82. సరళీకరించండి: 0.004 × 0.5

A) 2
B) 0.002
C) 0.02
D) 0.2

83. సూర్యుడు మరియు నక్షత్రాల్లో __________ ఉండడం వల్ల అవి మెరుస్తూ కనిపిస్తాయి.

A) వాయువులు
B) ప్లాస్మా
C) విద్యుత్
D) కాంతి శక్తి

84. ఒక క్రమ పిరమిడ్ యొక్క భూమి 16 యూనిట్ల కర్ణంతో చతురస్రంగా ఉంది. దాని ఏటవాలు అంచు 17 యూనిట్లు. నిలువు ఎత్తు ఎంత?

A) 12
B) 30
C) 15
D) 25

85. క్రింద ఇచ్చిన ఐచ్ఛికాల నుంచి భిన్నమైన దానిని ఎంచుకోండి.

A) HJL
B) OQS
C) PRT
D) WYZ

86. ఈ ప్రశ్నలో, ఒక వ్యాఖ్యానం ఇవ్వబడింది. దానిని అనుసరిస్తూ రెండు తీర్మానాలు కూడా ఇవ్వబడ్డాయి. ఇచ్చిన వ్యాఖ్యానానికి తార్కికంగా సరిపోయే తీర్మానం(లు) ఎంచుకోండి.

వ్యాఖ్యానం:
27 నుంచి 32 సంవత్సరాల మధ్యలో యువకులై చురుగ్గా మరియు దూకుడుగా ఉండే అభ్యర్థులు కావాలి.

తీర్మానాలు:
I. 27 సంవత్సరాల కంటే తక్కువ వయసు వాళ్లు చురుగ్గా ఉండరు.

II. 32 సంవత్సరాలు పైబడిన వాళ్లు యువకులై ఉండరు.

A) తీర్మానం II మాత్రమే అనుసరిస్తోంది
B) తీర్మానం I మరియు II అనుసరిస్తున్నాయి
C) తీర్మానం I లేదా II అనుసరించడం లేదు
D) తీర్మానం I మాత్రమే అనుసరిస్తోంది.

87. క్రింది పేర్కొన్న ఏ పన్ను కేంద్ర ప్రభుత్వం ద్వారా విధించి, సేకరించి మరియు ఉంచబడుతుంది?

A) వ్యవసాయ ఆదాయంపై పన్నులు
B) 'కార్పొరేట్' పన్ను
C) వినోదపు పన్ను
D) భూమి శిస్తులు

88. ఒక బాలుడు ప్లాట్‌ఫామ్ మీద నిల్చుని తన వాచీ చూస్తే, సాయంత్రం 3:45 గంటలు చూపిస్తోంది. వాచీలోని గంటల ముల్లు తూర్పు వైపు చూపిస్తోంది. నిమిషాల ముల్లు పశ్చిమం వైపు చూపిస్తోంది. ఇప్పుడు ఆ కుర్రాడు ఏ దిక్కు వైపు చూస్తున్నాడు?

A) తూర్పు
B) ఉత్తరం
C) ఆగ్నేయం
D) నైరుతి

89. హీలియం పరమాణుకత ఏమిటి?

A) 'ట్రై అటామిక్'
B) 'డై అటామిక్'
C) పాలీ అటామిక్'
D) 'మోనో అటామిక్'

90. క్రింది వాటిలో దోమల జీవ నియంత్రణ కోసం ఏది ఉపయోగిస్తారు?

A) 'గంబూసియా'
B) లేపనము
C) D. D. T
D) నూనె

91. రుస్తుం-2 అనేది భారతదేశపు రక్షణ పరిశోధనా మరియు అభివృద్ధి సంస్థ (DRDO) ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక __________.

A) క్షిపణి-వ్యతిరేక ట్యాంక్
B) గగనతలం నుంచి గగనతల క్షిపణి
C) మానవ రహిత యుద్ధ వైమానిక వాహనం
D) తేలికపాటి బరువు గల వాహనం

92. అయోడిన్ ఆహారంలో_____ఉనికిని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.

A) పిండి పదార్థము
B) విటమిన్
C) క్రొవ్వు
D) ప్రొటీన్

93. భోపాల్ దుర్ఘటన సమయంలో విడుదలైన వాయువు -

A) 'మిథైల్ ఐసోసైనేట్'
B) 'ఇథైల్ ఐసోథియోసైనేట్'
C) 'సోడియం ఐసోథియోసైనేట్'
D) 'పొటాషియం ఐసోథియోసైనేట్'

94. దిగువ ఇచ్చిన తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా సూచించే బొమ్మను ఎంచుకోండి:
కూరగాయలు, మహిళలు, సింహం, చిలుక

95. క్రింది శ్రేణిలో తప్పుగా ఉన్న అక్షరాల గ్రూపును కనుగొనండి.
BZ, DV, ES, HN, JJ

A) HN
B) BZ
C) ES
D) JJ

96. sin(180° - θ) cos (90° - θ) - cos (180° - θ) sin (90° - θ) విలువ కనుగొనండి.

A) cos θ
B) tan θ
C) 0
D) 1

97. అనిత ఉత్తరం వైపు 4 కి.మీ నడిచి, ఎడమవైపు తిరిగింది. 2 కి.మీ నడిచిన తర్వాత, కుడివైపు తిరిగి మరో 5 కి.మీ నడిచింది. ప్రారంభ స్థానం నుంచి ఆమె ఇప్పుడు ఏ దిక్కులో నిలబడి ఉంది?

A) ఈశాన్యం
B) ఆగ్నేయం
C) నైరుతి
D) వాయువ్యం

98. x3 + 5x2 - 2x - 24లో x = 2 వద్ద ఒక సున్నా ఉంది. మిగతా సున్నాలను కనుగొనుము.

A) 3, 4
B) -3, 5
C) -2, -3
D) -3, -4

99. ఒక నిర్థిష్ట కోడ్ లో 'ITNIETAM'ని 'INTIMATE'గా సంకేతికరిస్తే, ఆ కోడ్ లో 'TREVNIETARBI'ని ఎలా సంకేతిస్తారు?

A) INVRETIBRATE
B) INVERTIBARTE
C) INVERTIBRETA
D) INVERTIBRATE

download

Click Here To Download PDF

Study Kit for RRB Junior Engineer EXAM (Phase-1)

 

उत्तरमाला:-

1. (d), 2. (a), 3. (b), 4. (b), 5. (b), 6. (c), 7. (b), 8. (b), 9. (d), 10. (c)
11. (a), 12. (b), 13. (c), 14. (b), 15. (c), 16. (b), 17. (c), 18. (b), 19. (b), 20. (a)
21. (b), 22. (a), 23. (a), 24. (a), 25. (d), 26. (c), 27. (d), 28. (d), 29. (d), 30. (a)
31. (b), 32. (a), 33. (b), 34. (b), 35.(d), 36. (a), 37. (c), 38. (d), 39. (b), 40. (c)
41. (c), 42. (a), 43. (b), 44. (c), 45. (b), 46. (c), 47.(b), 48. (a), 49. (d), 50. (a)
51. (d), 52. (b), 53. (d), 54. (d), 55. (a), 56. (b), 57. (c), 58. (a), 59. (c), 60. (a)
61. (a), 62. (d), 63. (a), 64. (a), 65. (c), 66. (b), 67. (b), 68. (a), 69. (a), 70. (c)
71. (d), 72. (d), 73. (c), 74. (b), 75. (b), 76. (c), 77. (c), 78. (b), 79. (c), 80. (b)
81. (c), 82. (b), 83. (b), 84. (c), 85. (d), 86.(c), 87. (b), 88. (b), 89. (d) 90. (a)
91. (c), 92. (a), 93. (a), 94. (d), 95. (c), 96. (d), 97. (d), 98. (d), 99. (d)



 

IMPORTANT: RRB EXAM PORTAL is NOT associated with Railway Recruitment Board(RRB) or Indian Railways, For RRB official website visit - www.rrcb.gov.in